logo

ఉట్నూర్ లో మాంగ్ సమాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా

ఉట్నూర్ సెప్టెంబర్ 21 :
మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం – తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఉట్నూర్ లోని HKGN కన్వెన్షన్ హాల్ లో ఆదివారం మాంగ్ సమాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజ ఐక్యత, అభివృద్ధి, పరస్పర గౌరవం ప్రధాన లక్ష్యాలుగా ఈ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో సమాజ బంధువులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహిత్య సమ్రాట్, లోక శాహిర్ డా. అన్నాభావు సాఠే గారి కోడలు శ్రీమతి సావిత్రిబాయి సాఠే గారు మరియు మనవడు శ్రీ సచిన్ భావు సాఠే గారు విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

శ్రీమతి సావిత్రిబాయి సాఠే గారు మాట్లాడుతూ –
"मी अडाणी आहे पण तुम्ही शिकून अडाणी राहू नका" (నేను చదువుకోలేదు, కానీ మీరు చదువుకుని అజ్ఞానం లో ఉండకండి) అని సమాజానికి బలమైన సందేశం ఇచ్చారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువులో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

శ్రీ సచిన్ భావు సాఠే గారు మాట్లాడుతూ –
అన్ని సమాజ సంఘాల మధ్య ఐక్యత, సమగ్రత పెంపొందించుకోవడం చాలా అవసరమని, పరస్పరం గౌరవం కలిగితేనే సమాజ ప్రగతి సాధ్యమని ఆయన సూచించారు. అనంతరం అతిథులకు శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షుడు సంజీవ్ గాదెకర్, దలిత రత్న అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, పండరి సూర్యవంశీ, ఉద్దవ్ కాంబ్లే, దత్తరాజ్ గాయక్వాడ్, సమాజ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.

41
258 views