logo

రాజాం విజేత కోచింగ్ సెంటర్ -మెగా డీఎస్సీ 2025 అద్భుత విజయాలు



విజయనగరం జిల్లా. రాజాం న్యూస్.

ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో (మెగా డీఎస్సీ - 2025) రాజాం ‘విజేత' కోచింగ్ సెంటర్ విద్యార్థులు విశేష ఫలితాలు సాధించారు. సుమారు 150-200 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలను పొందడం సెంటర్ కు గర్వకారణమైంది.ఈ సందర్భంగా జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ హాజరై విజయవంతమైన అభ్యర్థులను అభినందించారు.కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీదేవి విద్యార్థుల విజయానికి అంకితభావంతో కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అభ్యర్థులను సమర్థవంతంగా తీర్చిదిద్దిన అప్పలరాజు మాష్టారు సేవలను ప్రత్యేకంగా గుర్తించారు.
ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఉపాధ్యాయునికి, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ‘విజేత'లో శిక్షణ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

14
423 views