
విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా
విజ్ఞాన్ విద్యాలయం వ్యవస్థాపకులు నడిపల్లి ప్రభాకర్ రావు
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలోని విజ్ఞాన్ విద్యాలయంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయ పండుగను పురస్కరించుకొని విద్యార్థినులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, పాఠశాల ఆవరణాన్ని ఉత్సవ వాతావరణంగా మార్చేశారు.
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ విద్యార్థినులు పాటలు పాడుతూ, చిందులు వేస్తూ సందడి చేశారు. విద్యార్థులు కోలాట నృత్యాలు, ఆటపాటలతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాలయం వ్యవస్థాపకులు నడిపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ,బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే వేడుక. చిన్నారుల్లో సాంస్కృతిక అవగాహన పెంపొందించడమే కాక, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు నడిపెల్లి ప్రభాకర్ రావు, రాధ,కరస్పాండెంట్ సుధీర్ రావు, గీతా శ్రీ, ఉపాధ్యాయులు షహనాజ్, రాశి, శ్వేత, ఆసిఫా విద్యార్థినీ విద్యార్థులు,తల్లితండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.