logo

అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

నంద్యాల, సెప్టెంబర్22, AIMA మీడియా:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం శ్రీ కాశిరెడ్డి నాయన సత్రం ఓంకారం వారి ఆధ్వర్యంలో అందజేసే ఉచిత భోజన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విని స్పందించిన కలెక్టర్, అధికార యంత్రాంగం–ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా సేవా దృక్పథం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఆమె తెలిపారు. అర్జీదారులతో కలసి భోజనం చేయడం ద్వారా అధికార యంత్రాంగం మరియు ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం లక్ష్యమని స్పష్టం చేశారు. "ప్రజలతో భోజనం పంచుకోవడం ద్వారా వారి మనసులోని మాటలు నేరుగా వినే అవకాశం కలుగుతుంది. ఇది ప్రజా సేవలో పారదర్శకతను మరింత బలపరుస్తుంది" అని కలెక్టర్ అన్నారు.

4
12 views