
నంద్యాల పట్టణ కేంద్రంలోని ఎస్డీపిఓ కార్యాలయంతో పాటు పలు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ...
నంద్యాల, సెప్టెంబర్22,AIMA మీడియా:
నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ ఐపీఎస్ నంద్యాల పట్టణంలోని ఎస్డీపిఓ కార్యాలయం మరియు తాలూకా పోలీస్ స్టేషన్ ను, సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్,నంద్యాల పోలీస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలనుఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ముందుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పోలీసుల పనితీరుపై ఆరా తీశారు.
అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు పలు రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు.
అనంతరం పోలీస్ క్వార్టర్స్ వద్ద గల పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ ను సందర్శించి ఇక్కడ ఉన్న మందుల వివరాలు డాక్టర్ల పనితీరు మొదలగు వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నంద్యాల ఎస్డీపిఓ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది వివరాలు వారు చేయుచున్న విధుల గురించి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ మరియు, సైబర్ క్రైమ్, మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నంద్యాల పట్టణంలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సిబ్బంది వివరాలు, లాకప్ గదులు, పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన నేరస్తుల ఫోటోల వివరాలు,సిబ్బంది నిర్వహించుచున్న విధులు మొదలగువాటి గురించి అడిగి తెలుసుకుని సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతూ మీకు అప్పగించిన కేసుల దర్యాప్తులో మరియు నేరస్తులను కనుగొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పలు సూచనలు చేయడం జరిగింది.
నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పలు కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం స్టేషన్ పరిధి, స్టేషన్ పరిధిలోని ప్రజల నిష్పత్తి, నేరాలు అదుపు చేయడంలో తీసుకుంటున్న చర్యలు,స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మొదలగు వాటిపై ఆరా తీశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంచుకోవాలని ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్ ఐపీఎస్, ట్రైనింగ్ డిఎస్పి రాజసింహారెడ్డి గారు పాల్గొన్నారు.