logo

ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంప్ ఆఫీస్ నందు బీజేపీ ప్రజా ప్రతినిధుల భేటీ.. #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంప్ ఆఫీస్ నందు బీజేపీ ప్రజా ప్రతినిధుల భేటీ..
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు..
తాడిగడప లోని ఎమ్మెల్యే సుజనా క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి ఆత్మీయ సమావేశం జరిగింది..
స్నేహపూర్వక వాతావరణం లో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్ , మాజీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, నడుకుడితి ఈశ్వరరావు,ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కి సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. అనంతరం నాయకులంతా విందులో పాల్గొన్నారు.

19
2773 views