logo

రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నాం. దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.: హోం మంత్రి అనిత. #AIMA MEDIA Suvarnaganti Raghava

రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నాం.
దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.: హోం మంత్రి అనిత.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. దేవీ నవరాత్రులు సందర్భంగా కూటమి మహిళా నేతలు ఎర్ర దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో కలర్ కోడ్ డ్రెస్‌తో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ కోడ్ దుస్తుల్లో కూటమి పార్టీల మహిళ సభ్యులు సభకు వచ్చారు. నేటి ఉదయం దుర్గమ్మ గుడికి వెళ్లిన కూటమి మహిళా నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం వెళ్లాలనే డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని చెప్పారు. అందరు గాయత్రీ దేవి అలంకారానికి అనుగుణంగా రెడీ శారీస్‌తో వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామన్నారు. దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అందరికి హోం మంత్రి అనిత నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు.

5
799 views