logo

AP Assembly Bills 2025: అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు....



అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో రెండు బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి పలు చట్ట సవరణ బిల్లులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఆముదాలవలస నియోజకవర్గంలో అమృత్ 2 పథకం దుర్వినియోగంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కాలింగ్ అటెన్షన్ ఇవ్వనున్నారు......


ఇంకోవైపు మంగళవారం అసెంబ్లీలో మూడు బిల్లులతోపాటు ఒక తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, ఎంఎస్ రాజు, బి.రామాంజనేయులు మద్దతు తెలిపారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక స్థానిక సంస్థలకు నాలా ఫీజు ఇచ్చే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు బదులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యే పార్థసారథి మద్దతు తెలిపారు.

0
24 views