logo

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుక

తొర్రూరు సెప్టెంబర్ 24 (AIMEMEDIA ) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో తొర్రూర్ డివిజన్ కేంద్రంలో బుధవారం కిరాణా ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవం నిర్వహించారు .ముందుగా గారుహం చేసి ఆర్ఎస్ఎస్ దివంగత నాయకులకు భారతమాత చిత్రపటానికి పుష్పమాలలు వేశారు.ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా సేవా ప్రముఖ్ కుదురుపాటి వివేక్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘం స్వయం సేవకుల ద్వారా సమాజంలో సామాజిక సమరసత, స్వదేశీ, పౌర విధులు, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని కోరారు. గత నూరు సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో సంఘటన, వ్యక్తి నిర్మాణం, జాతీయ శీల నిర్మాణం చేపట్టడం దేశభక్తిని పెంపొందించడం జరిగిందన్నారు ‌. సంఘం సమాజంలో వ్యక్తులను నిర్మించి సమాజం లోని వివిధ వర్గాలకు చేరే విధంగా కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ,విద్యారంగంలో అఖిల భారత విద్యార్థి పరిషత్, ధర్మ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యాయ రంగంలో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్, సేవా రంగంలో సేవాభారతి పనిచేస్తుందన్నారు. చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుందని, విజయానికి గుర్తుగా విజయదశమి వేడుకలు అనాదిగా నిర్వహిస్తున్నట్లు పురాణాలు ఇతిహాసాలు కూడా తెలుపుతున్నాయని చెప్పారు హిందువులలో కూడా సమరసత భావాన్ని పెంపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ ఖండ కార్యవాహ గంధం వెంకన్న, మానుకోట జిల్లా వ్యవస్థాపక గుజరాతి శివకుమార్, జిల్లా పర్యావరణ ప్రముఖ దారం కుమారస్వామి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మానుకోట జిల్లా అధ్యక్షులు జంజీరాల నాగరాజు, సంఘ బాధ్యులు ఇమ్మడి రాంబాబు అనుమాండ్ల మోహన్ రెడ్డి , పేర్న రఘుపతి, డాక్టర్ రామారావు మహేంద్ర చారి, నాళ్ళ చందు, తెమడ హరిబాబు, తిర్లాపురం సందీప్, తదితరులు పాల్గొన్నారు

0
46 views