వర్షాకాలం వస్తే చాలు రాకపోకలకు ఇబ్బంది
విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, గొల్లలములగం గ్రామం లో గల పెద్ద చెరువు సుమారు 85 నుండి 90 ఎకరాలు విస్తీర్ణం కలిగి వున్నా చేరువు ఈ మధ్య కాలం లో కురుస్తున్న వర్షాలు కారణంగా మరియు చుట్టుపక్కల కొండనీరు పొలాల నీరు వచ్చి కలవటం తో చేరు పూర్తిగా నిండి ములగం నుండి గొల్లలపాలం, కామశిగడం వేలే రహదారి మీదుగా నీరు ప్రవహిస్తువుండడం జరుగుతుంది. దీని వల్ల చుట్టుపక్కల రైతులు ప్రజలు వాహనదారులు త్రివర ఇబ్బందికి గురు అవుతున్నారు. ఈ రహదారి మధ్యలో సపట లోతు ఉండటం తో ఈ ఇబ్బంది కలుగుతుంది, దీనికి త్వరగా చర్యలు తీసుకొని రహదారి బ్రిడ్జి మంజూరు చేసి పనులు ప్రారంభం చేయవలసింది గా ప్రజలు కోరుతున్నారు, ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది గురు అవుతున్నాం అని అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవటమే గాని తగిన చర్యలు తీసుకోవటం లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ నష్టం జరగక ముందే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు