
బంధితులుగా ఉంచిన 23 మంది ఎట్టకేలకు విముక్తి పొందారు.
గుడిపాల మండలంలో బంధితులుగా ఉంచిన 23 మంది ఎట్టకేలకు విముక్తి పొందారు. గట్రాళ్లమిట్ట గ్రామంలో ఇటుక బట్టీ యజమాని ఇర్ఫాన్ చేతిలో కూలీలుగా మాత్రమే కాకుండా బంధీలుగా నిలిపివేయబడ్డ ఈ కుటుంబాలు చివరకు రెవెన్యూ, లేబర్, సోషల్ వెల్ఫేర్ అధికారుల జోక్యంతో వెలుగులోకి వచ్చాయి.
రిపోర్టర్ వాయిస్ ఓవర్:
గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్ట గ్రామంలో ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇటుక బట్టీ నడుపుతున్నాడు. 2013లోనే తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి 18 మంది, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఐదు ఎస్టీ కాలనీ వాసులను పనులకు తీసుకొచ్చి బంధించారు. తీసుకున్న అడ్వాన్స్ పేరు మీదే దాదాపు 12 సంవత్సరాలుగా వీరిని బానిసలుగా ఉంచారు. ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, 11 మంది చిన్నారులు ప్రతిరోజూ 15 గంటలపాటు ఇటుక పనుల్లో నిమగ్నమయ్యేవారు.
వీరు మట్టి కలపడం, మోల్డింగ్ చేయడం, ఇటుకలు మాడుపెట్టడం, రవాణా చేయడం వంటి పనులు చేస్తూ తాత్కాలిక గుడారాల్లో, విద్యుత్ సౌకర్యం లేకుండా జీవించాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో శారీరక దాడులు, అవమానకరమైన వాక్యాలతో బాధ పెట్టడంతో అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది.
విజువల్స్:
పని చేస్తున్న కార్మికులు – మట్టి కలుపుతున్న దృశ్యాలు
పోలీస్, రెవెన్యూ అధికారులు గుడారాలను పరిశీలిస్తున్న షాట్స్
బంధీలు గుడిపాల తహసీల్దార్ కార్యాలయంలో కూర్చుని ఉన్న దృశ్యాలు
రిపోర్టర్ వాయిస్ ఓవర్:
వెంటనే అధికారులు ఇటుక బట్టీపై దాడి చేసి వారిని విముక్తి చేశారు. అనంతరం వారందరినీ గుడిపాల తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి వారి వేదనను విన్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి స్వయంగా రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుని ఎస్టీ కుటుంబాలతో మాట్లాడారు. వారికి ఆర్థిక సహాయం అందజేసి, అధికారిక రిలీవింగ్ ఆర్డర్ కాఫీలు ఇచ్చి స్వగ్రామాలకు పంపించారు.
సింక్ బైట్ (జేసీ/విద్యాధరి):
"మిమ్మల్ని ఇకపై ఎవరూ ఇలాగే బంధించలేరు. స్వేచ్ఛగా జీవించండి. ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది."
రిపోర్టర్ వాయిస్ ఓవర్:
ఇటుక బట్టీ యజమాని ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసేందుకు కూడా అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఈ ఆపరేషన్‌లో ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, సర్వేయర్ గోపీనాథ్, వీఆర్ ఓలు పాల్గొన్నారు.
అంకర్ క్లోజ్ లైన్:
చాలా సంవత్సరాల తరువాత చీకట్లోనుంచీ వెలుగులోకి వచ్చిన ఈ 23 మంది ఇపుడు స్వేచ్ఛాయుతమైన జీవితం మొదలు పెట్టబోతున్నారు.