
తేది:26.09.2025
అదిలాబాద్ జిల్లా శుక్రవారం
*మొదటి సారిగా అనాధ పిల్లలతో కలెక్టర్ సమావేశం – ఆయుష్మాన్ కార్డుల పంపిణీ
పిల్లలతో సహపంక్తి భోజనం
పత్రిక ప్రకటన
తేది:26.09.2025
అదిలాబాద్ జిల్లా శుక్రవారం
*మొదటి సారిగా అనాధ పిల్లలతో కలెక్టర్ సమావేశం – ఆయుష్మాన్ కార్డుల పంపిణీ
పిల్లలతో సహపంక్తి భోజనం
ప్రతి మూడు నెలలకు సమావేశం
కలెక్టరేట్ సమావేశ మందిరం లో శుక్రవారం అనాధ పిల్లలు, కోవిడ్ పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్ లతో కలెక్టర్ రాజర్షి షా సమావేశమయ్యారు. విద్యా, ఆరోగ్యం , వారి సమస్యలు తదితర అంశాలపై పిల్లలతో చర్చించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి, పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
జిల్లాలోని 202 మంది పిల్లలకు ఆరోగ్యశ్రీ, 8 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామని తెలిపారు. వసతి లేని అనాధ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి పిల్లలతో సమావేశమవుతామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ప్రతీ ఒక్కరితో మాట్లాడించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని తెలిపారు .
ఈ సందర్భంగా ఆర్‌బీఎస్‌కే కాంపు ద్వారా పిల్లల రక్తపరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, డీడబ్ల్యూఓ మిల్కా, డిసిపీఓ రాజేంద్రప్రసాద్, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారిణి అదిలాబాద్ చే జారీ చేయనైనది.