
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరసాహిత అభియాన్.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమాజిక సమరసత అభియాన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల పాదాలు కడిగి పూలుచల్లి పాదపూజ చేసిన ఎంపీ ఈటల రాజేందర్.
విశ్వహిందూ పరిషత్ లో ఒక విభాగమైన సామాజిక సమరసత అభియాన్ కంటి లో ఈ కార్యక్రమం నిర్వహించింది.
ఏ జాతి అయితే ఇన్నాళ్లు వెలివేయబడిందో వారికి ఈరోజు పాదపూజ చేసాం.
ఏ ఊరికి వెళ్లినా దళితవాడ ఊరి బయట ఉంటే, తండాలు ఊరికి దూరంగా ఉంటాయి.
స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లయినా ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండి అవమానపడుతున్న సందర్భంలో.. మనుషులందరూ కులమతాలకు అతీతంగా సమానంగా ఉండాలని భావనతో సామాజిక సమరత కార్యక్రమలో భాగంగా వెలివేయబడ్డ ఆడబిడ్డలకు మేము స్వామీజీలు పాదపూజ చేశాము.
ఈ పాదపూజ ఆ జాతి ఆడబిడ్డలకు గౌరవాన్ని విశ్వాసాన్ని అందిస్తుందని భావిస్తున్నా.
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో చాలా కాలం “రెండు గ్లాసుల “ వ్యవస్థ ఉండేది.
వాళ్ల గ్లాసులో వాళ్లే నీళ్లు, చాయ్ తాగాలి కడిగి పెట్టుకుని మళ్లీ దాంట్లోనే తాగాలి తప్ప మిగతావాళ్లతో కలిపేది లేకుండే..
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా ఇది కొనసాగుతుంది.
వీటిని అంతం చేయడానికి చేసే ఈ ప్రయత్నం సజావుగా ఇంకా గొప్పగా జరగాలని కోరుకుంటున్నాను.
ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన ధనుంజయ గారికి ధన్యవాదములు.
ఈరోజు దళిత, లంబాడా మహిళల పాదపూజ చేసినందుకు నేను గర్వపడుతున్నా.