logo

నర్సాపూర్‌ – గోటిపటార్‌ రహదారి చిన్న బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి

నర్సాపూర్: నిన్న రాత్రి నర్సాపూర్ బి నుండి గోటిపటార్‌కు వెళ్లే మార్గంలో ఉన్న చిన్న బ్రిడ్జి కూలిపోవడంతో గోటిపటార్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పూర్తిగా నిలిచిపోయిన కారణంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యపై గ్రామ సెక్రటరీ గారిని సంప్రదించగా, తాత్కాలిక రహదారి బ్రిడ్జి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే గ్రామస్తులు తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వెంటనే స్పందించి పర్మినెంట్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.

👉 గ్రామస్తుల మాటల్లో: “ప్రతి వర్షాకాలంలో ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇకపై తాత్కాలిక రహదారులు మాకు వద్దు, శాశ్వత బ్రిడ్జే పరిష్కారం” అని గ్రామస్థులు తెలిపారు.

9
942 views