అన్నమయ్య కలెక్టర్, ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్ ని, ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ధీరజ్ కుమార్ ను శనివారం ఉదయం రాయచోటి వారి కార్యాలయాల్లో వైఎస్సార్సీపీ రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు జిల్లాలో సమగ్ర అభివృద్ధి, శాంతి భద్రతల కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.