ఆళ్లగడ్డలో రేపు తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం
AIMA న్యూస్ మీడియా. నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలో రేపు (ఆదివారం) ఏపీ తైక్వాండో అసోసియెషన్ ఆద్వర్యంలో ఎగ్జికూటివ్ కౌన్సిల్,వార్షిక జనరల్ బాడి మీటింగ్ ను నిర్వహిస్తున్నట్లు తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ ఎల్.టి చంద్రమౌళి తెలిపారు. స్థానిక టీ.ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తైక్వాండో క్రీడల అభివృద్ధి గురించి చర్చిస్తామన్నారు.