logo

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

తొర్రూరు సెప్టెంబర్ 27(AIMEMEDIA లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో నితిన్ ఫౌండేషన్ లో శనివారం వంద మంది విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ పై పుస్తకాల పంపిణీ, ముడుపు రవీందర్ రెడ్డి కుమారుడు, కుమార్తె బాబు రెడ్డి,మహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా బియ్యం నిత్యవసర సరుకులను ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కుందూరు రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను గుర్తించి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కూల్ గ్యాట్ డాక్టర్ కిరణ్ కుమార్,ఆర్ సి దామెర సరేష్, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్,లయన్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

0
34 views