logo

ఎస్సీ, ఎస్టీ ల పై దాడులు దుర్మార్గమైన చర్య

తేదీ.27.09.2025


*ఎస్సీ, ఎస్టీ ల పై దాడులు*
*దుర్మార్గమైన చర్య*


స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ దేశంలో, రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరగడం చాలా దుర్మార్గమైన దుశ్చర్య ప్రజలకు రక్షణ కల్పించవలసిన రక్షణ శాఖ ప్రజలపై ముఖ్యంగా ఎస్సీ మరియు ఎస్టీలపై చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని క్రమశిక్షణ పేరిట విచక్షనా రహితంగా కొట్టడం చాలా అమానుషమైన చర్య ఇందుకు నిదర్శనమే బాపట్ల జిల్లా మార్టూరు మండలం లో మోడీకి చెందిన వారు దళిత యువకులైన అల్లాడి ప్రమోద్ కుమార్ జ్యోతి, పోతులూరి లను పోలీస్ స్టేషన్ కు పిలిపించి సిఐ తొక్కి పట్టి ఇద్దరు పోలీసులతో అరికాళ్లపై బొబ్బలు వచ్చే విధంగా కొట్టి ఆ తర్వాత ఆ
బొబ్బలు తగ్గేవరకు కంకర రాళ్లపై నడిపించడం, తర్వాత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదే గతి పడుతుందని హెచ్చరించడం చాలా విచార కర మైన చర్య చట్టాన్ని చేతిలోకి తీసుకొని దళితులను కొట్టిన వారి పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈ చర్య కు కారకులైన వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని వారందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలని జయభీమ్ భారత పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పంపాన నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు,పార్లమెంట్ ఇంచార్జ్ చెన్నం అరుణ్ కుమార్, పార్టీ నాయకుడు మామిడి కుమార్ పాల్గొన్నారు.

1
0 views