logo

స్వస్థ నారీ,సశక్త్ పరివార్ అభియాన్ మెగా వైద్య శిబిరం ఏర్పాటు.

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జరజాపుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(PHC) నందు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో, డిఎంహెచ్ఓ సూచనలతో, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష నేతృత్వంలో, వైస్ చైర్మన్ సముద్రపు రామారావు పర్యవేక్షణలో ఈ రోజు "*స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్*" మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది.
ఈ మెగా మెడికల్ క్యాంప్ లో, గైనకాలజిస్ట్, ఆర్థోపెటిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కంటి సమస్యలకు ఆప్తోలమిక్ మొదలగు విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరు హాజరు అయ్యి సుమారు 360 మంది పేషెంట్లకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులను సరఫరా చేయడం జరిగింది.
విశేషంగా అధిక సంఖ్యలో స్త్రీ లు (అక్క, చెల్లెలు) హాజరై వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంను ఉద్దేశించి నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్ శ్రీ సముద్రపు రామారావు మాట్లాడుతూ.. జరజాపుపేట ప్రజలందరి కల ప్రభుత్వ హాస్పిటల్. జరజాపుపేటలో హాస్పిటల్ మంజూరు చేసి, హాస్పిటల్ నిర్మాణంకు సహకరించిన పాలకులకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ.. ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండాగా అక్టోబర్ మొదటివారం నుండి మన హాస్పటల్ కు ప్రతి ఒక్క స్పెషలిస్టు వైద్యులు హాజరవుతున్నందున, ఈ సదావకాశాన్ని జరజాపుపేట ప్రజలతో పాటు ఈ చుట్టుపక్క ప్రజలందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలని, నేటి పాలకులుహాస్పిటల్ ను మరింత అభివృద్ధి చేయాలని, హాస్పటల్ సిబ్బంది మరియు ANM లు,ఆశ వర్కర్లు, నెల్లిమర్ల జరజాపుపేట ప్రజలు యొక్క ఆరోగ్యానికి పెద్దపేట వేయాలని, అహర్నిశలు
శ్రమించాలని, ఏ ఒక్క పేదవాడు ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లకుండా మన ప్రభుత్వ హాస్పిటల్ నందు వైద్యం చేయించుకోవాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ సముద్ర రామారావు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష,
17 వ వార్డు కౌన్సిలర్ శ్రీ అవనాపు సత్యనారాయణ, 18,19 వార్డుల కౌన్సిలర్ లు శ్రీ నల్లి శ్రీను, శ్రీ తుమ్ము నారాయణమూర్తి, మాజీ నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మద్దిల వాసు, ఏఎంసి మాజీ డైరెక్టర్ శ్రీ పోలుబోతు నారాయణమూర్తి, పెద్దలు శ్రీ నల్లి బంగారు చంద్రశేఖర్ మరియు PHC హాస్పిటల్ నిర్వాహకులు శ్రీ శ్రీను, హాస్పిటల్ సిబ్బంది, ANM లు, ఆశా వర్కర్స్,అంగన్వాడి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

1
0 views