logo

*హివాగా* బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న సిరమ్మ

*హివాగ బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన సిరమ్మ*

తే27.09.2025దీ,
విజయనగరం,

విజయనగరం నకు చెందిన *హివాగా* బ్యూటీ క్లినిక్ సీ ఇ ఓ హరిత పిలుపు మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* విజయనగరం లోని ఆదిత్య హృదయం, థర్డ్ ఫ్లోర్, వినాయకనగర్, రింగ్ రోడ్డులో హరిత, సి.ఇ.ఓ, హివాగా బ్యూటీ క్లినిక్ షాప్ ప్రారంభోత్సవంనకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం ఇటువంటి బ్యూటీ క్లినిక్ లను ఏర్పాటు చేసుకోవడం మంచిదే అన్నారు.మహిళలు తమకాలపై తాము నిలబడేందుకు ఈ బ్యూటీ క్లినిక్ లు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. అందువలన నిరుద్యోగులైన మహిళలు వీటి ఏర్పాటుకు ముందుకు వస్తే మంచిదేనన్నారు.

ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

1
12 views