logo

పత్రికా ప్రకటన* *పంట పొలంలో కరెంటు వైర్ పెట్టి ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి వ్యక్తుల రిమాండ్*

*పత్రికా ప్రకటన*

*పంట పొలంలో కరెంటు వైర్ పెట్టి ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి వ్యక్తుల రిమాండ్*

*పంట పొలాలలో కరెంటు వైర్లు పెట్టినట్లయితే ఇక జైలుకే*

తేదీ 23/09/2025 రోజున *సడుమాకే సంతు బాయ్ r /o రోల్ మామడ* తన తండ్రి అయినటువంటి *మెండడి రంబు* అనే వ్యక్తి 20 తారీకున కనిపించకుండా పోయి ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి చనిపోయాడని తెలిసినదిగా ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది. దర్యాప్తులో భాగంగా ఇట్టి కరెంటు వైర్ ను *చిక్రామ్ పాండు r/o బాబ్జిపేట్* అను వ్యక్తి పెట్టడం జరిగినది. విచార రణలో భాగంగా *చిక్రం పండు* అడవిపందులకు రక్షణగా కొరకై అతి ప్రమాదమైన కరెంటు వైర్ ను ఏర్పాటు చేసినాడు. ఇట్టి కరెంటు వైర్ ముట్టినట్లయితే చనిపోతారని తెలిసి కూడా తను కరెంట్ వైర్ ను తన పొలంలో ఏర్పాటు చేసి మండాడేరంబు మృతికి కారమైనడు మరియు అట్టి శవం దొరికినట్లైతే అతనిపై కేసు అవుతుందని అట్టి శవాన్ని మాయం చేయాలని తన బామ్మర్ది అయినటువంటి *మండాడి ఈశ్వర్* యొక్క సహాయం తీసుకుని అట్టి శవాన్ని కడం వాగులో వేయడం జరిగింది. పూర్తి విచారణ అనంతరం *చిక్రం పాండు@పాండురంగ్, మండాడి ఈశ్వర్* లను ఈరోజు రిమాండ్ పంపడం జరిగినది.

ఎవరైనా రైతులు పంట రక్షణ కొరకై ప్రమాదకరమైనటువంటి కరెంటు వైర్లు పెట్టినట్లయితే వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని *ఇచ్చోడ సీఐ బి రాజు* తెలిపినారు

0
46 views