అరకు: అటవీ శాఖ ఎకో టూరిజం వద్దు అంటూ గిరిజనుల నిరసన
అరకులోయ మండలం మాడిగాడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద అటవీశాఖ ఎకో టూరిజం ఏర్పాటు వద్దు అంటూ స్థానిక గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద గిరిజనులు నిరసన తెలిపారు. స్థానిక గిరిజనులు మాడగడ సన్ రైజ్ వ్యూపాయింట్ నడుపుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా వ్యూ పాయింట్ అభివృద్ధి చేశామని, ఇప్పుడు వెల్లిపోండి అంటే మా ఉపాధి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.