logo

CM Yogi: ''ఘజ్వా-ఏ-హింద్ భారత్‌లో జరగదు''.. నరకానికి వెళ్లాలంటే ఆ కలలు కనండి..

CM Yogi: ఉత్తర్ ప్రదేశ్‌లో ''ఐ లవ్ ముహమ్మద్'' వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది.

ఈ సంఘటన తర్వాత యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వివాదానికి కారణమైన మౌలానా తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ అల్లర్లపై యూపీ సీఎం యోగి మాట్లాడుతూ..''తాను అధికారంలో ఉన్న విషయాన్ని మౌలానా మరిచిపోయినట్లు ఉన్నారు'' అని వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా, మరోసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల పరిరక్షణపై ఆదివారం స్పందించారు. శాంతిని దెబ్బతీసే వారిపై, ముఖ్యంగా పండగల సమయంలో ఏదైనా అరాచక చర్యలకు పాల్పడితే, వారి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ''ఘజ్వా- ఎ- హింద్'' హిందూస్థాన్ గడ్డపై జరగదు. ‘ఘజ్వా-ఎ-హింద్’ను ఊహించుకోవడం లేదా దాని గురించి కలలు కంటే నరకాని టికెట్ గ్యారెంటీ. ఈ నినాదంతో ఎవరైనా అరచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించనివ్వండి '' అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

''చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించే వారైనా, ప్రయాణిస్తున్న ప్రయాణికులపై దాడి చేసే వారైనా, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పండగల రోజు రాళ్లు రువ్వే వారికి నరకానికి వెళ్లడానికి వన్ వే టికెట్ ఇస్తాము'' అని శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు.

18
822 views