logo

ఆళ్లగడ్డ. ఏసీబీ వలలో మరో అవినీతి చేప

AIMA న్యూస్. నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డలో రహదారులు & భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి.సోమవారం రోజున లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన వర్క్ చేసుకునేందుకు గాను కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి 55 వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. బాధితుడు రమేష్ మొదట 40000 నగదు ఇవ్వడం జరిగింది, మరో 15 వేల రూపాయల కోసం ఏఈ దస్తగిరి డిమాండ్ చేయగా లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు తాము , తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరి పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు.

198
6996 views