logo

స్వస్తి నారీ స్వశక్తి పరివార్,పోషణ అభియాన్ కార్యక్రమం మహిళలు సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ రమణి

గొల్లలములగాం[ చీపురుపల్లి]:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరమని, దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణి సూచించారు.

27-09-2025 శనివారం గొల్లలమూలగాo గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు మరియు ఇతర మహిళలు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

గొల్లలములగాం గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించామని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు, బీపీ, షుగర్ ఉన్నవారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నామని డాక్టర్ రమణి వివరించారు.
పోషణ అభియాన్ కార్యక్రమంలో బాగoగా పోషక ఆహారంలకు సంబంధించి గొల్లలములగాం, గొల్లలపాళెం అంగన్వాడీ కార్యకర్తలు, స్టాల్ ఏర్పాటు చేసి, గర్భిణులు, బాలింతలు, పిల్లలు అందరూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని వివరించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో సి.హెచ్, ఏ.ఎన్.యమ్, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు, గ్రామపంచాయతీ పెద్దలు పాల్గొన్నారు.

22
507 views