logo

పెద్ద చెరువు వద్ద సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలు తీరొక్క పూలతో కనివిందు ...సద్దుల బతుకమ్మ జాతర.. వేలాదిగా తరలివచ్చిన ఆడబిడ్డలు రమనీయంగా బతుకమ్మ ఆటలు

తొర్రూరు సెప్టెంబర్ 29 : పట్టణంలోని పెద్ద చెరువు వద్ద సద్దుల బతుకమ్మ పూల జాతర ఎంతో కనువిందు చేసింది. సోమవారం సాయంత్రం ప్రారంభమైన సద్దుల బతుకమ్మ వేడుక గంటల వరకు కొనసాగింది. మొదటిరోజు మహిళలు ఎంతో ఉత్సాహంగా వచ్చినప్పటికీ వర్ష ప్రభావంతో తడిసి ముద్దయ్యారు. కాగా సోమవారం జరిగే సద్దుల బతుకమ్మ పండుగ కూడా పలు సందేహాల మధ్య సోమవారం పట్టణంలోని పురుహితులు జరుపుకోవాలని సూచించడంతో సద్దుల బతుకమ్మ పండుగ ఇంత ఉత్సాహంగా కొనసాగింది. ప్రకృతితో మమేకమైన మన జీవితాన్ని తెలియజేస్తాయి. ఒక ప్రాంతం యొక్క ప్రత్యేకతను అక్కడి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.
చారిత్రక, పౌరాణిక గాధల ఆధారంగా, వారసత్వంగా వస్తోన్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవ చిహ్నం….బతుకమ్మ…
ఊరూ వాడా ఏకమై పట్టు చీరలూ పరికీణీలతో బామ్మలూ అమ్మమ్మల నుంచి అమ్మాయిల దాకా ఉత్సాహంగా ఆడుతూ పాడే బతుకమ్మ పాటలు వినాలంటే . ఊరు ఊరూరా ఉన్న గల్లి గల్లి నుండి వినవచ్చు.
తెలంగాణ గ్రామీణ జీవన విధానంలో మొదలైన బతుకమ్మ నగరాల్లోనూ ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ప్రతిధ్వనిస్తోంది. ఆశ్వయుజ అమావాస్య నుండి నవమి దాకా ప్రతిరోజూ వివిధ రకాల నైవేద్యాలందుకునే బతుకమ్మ రోజుకో పేరుతో పిలువబడుతుంది. మహిళలు తొమ్మిది రోజులపాటు బతుకమ్మలను పేర్చి ఆయా రోజులు
ఆయా పేర్లు- నైవేద్యాలు ..
1వ రోజు – ఎంగిలి పూల బతుకమ్మ
పసుపు, గంగవెల్లి ఆకు తోడుగా పూలతో బతుకమ్మ సంబురం ప్రారంభంఅయి
రెండోరోజు అటికే బతుకమ్మ
సాదాసీదా వంటలు, ఆవాలు, పెరుగు వంటి పదార్థాలతో పూజలు.
మూడో రోజు మూడ బతుకమ్మ
తక్కువ పూలతో చిన్నగా ఏర్పాటు.
నాలుగో రోజు నాలుగ బతుకమ్మ
పసుపు గడ్డను వాడి పూజలు.
ఐదోరోజు ఆర బతుకమ్మ
చిన్న వంటకాలు, తినుబండారాలతో పూజ.
ఆరో రోజు ఏడు బతుకమ్మ
ఏడు రకాల వంటకాలతో పూజలు చేసే ఆనవాయితీ.
ఏడోరోజు వెన్నముద్దల బతుకమ్మ
వెన్నతో ముద్దలు చేసి వాటిని బతుకమ్మ చుట్టూ పెట్టి పూజ.
ఎనిమిదోరోజు అష్ట బతుకమ్మ
అష్టమి నాడు ప్రత్యేకంగా పూలతో అందమైన బతుకమ్మను అలంకరిస్తారు.
తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ
చివరి రోజు, ఇది అత్యంత ముఖ్యమైన రోజు.
ఐదు రకాల సద్దులు (అరటికాయ, గుమ్మడికాయ, సెనగలు, బియ్యం, పెసర పప్పు) నైవేద్యాలు పెట్టి పార్వతీ స్వరూపమైన గౌరమ్మను బతుకమ్మలు పెట్టి పూజలు చేశారు అనంతరం ఆ బతుకమ్మలను
పట్టణంలోని గంగమ్మ తల్లి ఒడికి చేర్చి, నిమజ్జనం చేశారు.
బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ఔషధ విలువలు ఉన్నాయి.
గుమ్మడి పువ్వు ఆరోగ్యానికి మంచిది.
ఇంట్లో చెడు శక్తులను దూరం చేస్తుందని విశ్వాసం
గున్నేరు రంగురంగుల అందంతో బతుకమ్మను అలంకరిస్తుంది.
దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు.
పసుపు రంగు తంగేడు పువ్వు
శరీరానికి చల్లదనం, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
గోరింటాకు పువ్వు స్త్రీల అందానికి ప్రతీక. .
బంతి పువ్వు ఎక్కువగా వాడే పువ్వు. పూజల్లో పవిత్రతకు ప్రతీక.
చామంతి దీర్ఘాయుష్కు ప్రతీక. సువాసనతో వాతావరణాన్ని సుందరంగా చేస్తుంది.
తుమ్మెద పువ్వు విభిన్న ఆకారంలో ఉండే పువ్వు. కళ్ళకు హాయిగా, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
వర్షాకాలం తర్వాత వచ్చే సీజన్‌లో ఈ పూలను స్పృశించడం, వాటి గుబాళింపులను ఆస్వాదిస్తూ ఆడడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని విశ్వాసం. సద్దుల బతుకమ్మ వేడుకలు శాంతి జీవితం పోలీస్ వారు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సౌండ్ అండ్ లైట్ సిస్టంతో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి ఎంతో కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ కుమార్ ఎస్సై ఉపేందర్ పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మత్స్యకారులు సహకారంను అందరూ కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్రాగు నీరు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మెకల కుమార్,జలీల్, విజయందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి. ప్రసాద్ రెడ్డి, బాపు రెడ్డీ, కృపాకర్ రాజు. దొంగరి శంకర్, పెదగాని సోమయ్య,narkuti గజానంద్, సోమన్న, చిదురాల రవి తదితరులు పాల్గొన్నారు..

0
595 views