logo

బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

పవర్ తెలుగు దినపత్రిక 29- 09-2025:బెల్లంపల్లి నియోజకవర్గం: వేమనపల్లి మండలంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వేమనపల్లి మండలంలో భారీ ఎత్తున బిఆర్ఎస్ (బిఆర్ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి చేరికల వివరాలు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారి సమక్షంలో వేమనపల్లి మండలం మాజీ జెడ్పిటిసి రుద్రబట్ల సంతోష్ కుమార్ వేమనపెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ గార్ల ఆధ్వర్యంలో వేమనపల్లి మండలానికి చెందిన ఉప్పులపు సాయి మరియు 400 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గారి సందేశo ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం రాబోయే ఎన్నికల్లో పాత–కొత్త విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరియు తాను చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, యువత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

8
366 views