logo

ఆళ్లగడ్డ. జనసేన నాయకుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

AIMA న్యూస్. నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు గురువారం రోజున మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాలూకా జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు , ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశాన్ని మేల్కొల్పిన స్వాతంత్ర సమరయోధుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అంటూ కొనియాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగ విజయదశమి. రాష్ట్ర ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందంగా సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి విజయం అందాలని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, రంగస్వామి, సజ్జల నాగేంద్ర, చంద్రబాబు, డేవిడ్, దూదేకుల బాబు, హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు

54
2582 views
  
1 shares