పేకాటరాయుళ్ల అరెస్టు
శ్రీకాకుళం:ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ అఖింఖాన్‌పేట శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినోద్‌కుమార్ తెలిపారు.