logo

సీ్త్ర శక్తి పథకం ద్వారా రూ.51 కోట్లు భారం

టెక్కలి: ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం దిగ్విజయంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో నెలకు సుమారుగా రూ.51 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 6 జిల్లాల్లో 1610 బస్సులు ఉన్నాయని వాటిలో సీ్త్ర శక్తి పథకానికి 1352 బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా బస్సులు పెంచే ఆలోచన ప్రభుత్వ విధానం పై ఆధారపడి ఉంటుందని ఈడీ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఒక సారి రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేయడం కష్టతరమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లను బీఓటీ పద్ధతి ద్వారా ఆధునీ కరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఈడీ పేర్కొన్నారు. ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌ ఫిట్టర్‌ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అప్రెంటిస్‌ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 154 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.1.10 కోట్ల పరిహారం అందజేస్తామ ని, సాధారణంగా మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు డీపీటీఓ సీహెచ్‌ అప్పలనారాయణ, డీఈ రవికుమార్‌, డీఎం ఎం.శ్రీనివాస్‌ ఉన్నారు.

1
57 views