నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న యంగ్ ప్రొఫెషనల్స్‌కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు
నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న యంగ్ ప్రొఫెషనల్స్‌కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు “మీరే వారధులు” అని అభివర్ణించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రగతికి యంగ్ ప్రొఫెషనల్స్ కీలక పాత్ర వహించాలని,ఉన్నత విద్యార్హతను సమాజహితానికి ఉపయోగించాలని,నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని,అభివృద్ధి అవకాశాలు ఉన్న రంగాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యంగా **ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లు, పి.జి.ఆర్.ఎస్** లలో భాగస్వామ్యం కావాలని సూచించారు.