
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ
నార్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశం మండల అధ్యక్షుడు లోఖండే దేవరావ్ అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగింది. సమావేశానికి కొమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాణోత్ గజానంద్ నాయకులు గారు హాజరయ్యారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నార్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధిష్టానం సూచన మేరకు అభ్యర్థి ఎంపిక ఉంటుందని వారు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనీ అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతీ, మాజీ జడ్పీటీసీ హేమలత బ్రీజులాల్, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తం, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ దాదే అలీ, దళిత రత్న నర్సింగ్ మోరే, AMC డైరెక్టర్ జాదవ్ కైలాస్ రాథోడ్ దత్తరాం, బాణోత్ ప్రణిత, VTDA
చైర్మన్ దిగంబర్ ఆడే, కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ రాథోడ్ కార్తీక్,మాజీ ఎంపీటీసీలు రుక్మబాయి, శివాజీ పటేల్, పరమేశ్వర్, కార్యకర్తలు నాయకులు ఉన్నారు.