
గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన దృశ్యం
గాంధీజీకి ఆశయాలను కొనసాగించాలి
మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనపుష్పాంజలి ఘటించిన వాసవి క్లబ్ బాధ్యులు
తొర్రూరు అక్టోబర్ 3: పట్టణ కేంద్రంలో ప్రాథమిక బాలికల పాఠశాల లో వాసవి క్లబ్, అధ్యక్షుడు చిదిరాల నవీన్ ఆధ్వర్యంలో హరిపిరాల కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 157 జయంతి వేడుకలను నిర్వహించారు. ఆ యా సంఘాల బాధ్యులు మాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపెట్టిన శాంతియుత అహింసా మార్గమే నేటికీ అనుసరణీయమని గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని అన్నారు. ఆయా కార్యక్రమంలలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ ఉపాధ్యక్షులు పెరుమళ చక్రపాణి, చలువాది సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తల్లాడ హీరాధర్, కోశాధికారి చిదురాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు ఏ,మోహన్ రెడ్డి, బిజ్జాల శ్రీనివాస్ రేగురు శ్రీనివాస్, వనమాల జయప్రకాష్, మచ్చ లక్ష్మయ్య, ఇమ్మడి రాంబాబు రేగురి శ్రీధర్, బిజ్జల సోమన్న ,చిదురాల యాకన్న , వల్లపు మధు, నువ్వు పాల్గొనగా ఇటీవల దుబ్బ తండా నివాసి మోహన్ నాయక్ కుమారుడు ఎంపీడీవో గా ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెలిపారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీ శంకర్, అధ్యక్షులు చిదురాల నవీన్ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు, కోశాధికారి గోపారపు నిరంజన్ రీజనల్ చైర్మన్ బిజ్జాల అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు