logo

పానాటూర్ ష్ణా గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం – వ్యక్తి మృతి

పానాటూర్ ష్ణా గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం – వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పరిధిలోని పానాటూర్ క్రిష్ణా గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, గత నెల 19.09.2025 వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో వెల్లూరు వైపు నుండి చిత్తూరు వైపుగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉండగా, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక టెంపో ట్రావెలర్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి తలకు గాయాలై స్పృహ తప్పి కుప్పకూలాడు.

స్థానికులు వెంటనే అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఆ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే గుడిపాల పోలీసులు లేదా గుడిపాల ఎస్‌ఐ ఫోన్ నంబర్ 9440796712 కి సంప్రదించవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

5
884 views