క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విజయవంతం.
నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ 3వతేది శుక్రవారం నిర్వహించిన జెబ్రోనిక్స్ - క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో 9 మంది విద్యార్థులు విజయవంతంగా ఎంపిక అయ్యారు అని ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ విజయం మా విద్యార్థుల కృషి, ప్రతిభ, మరియు నిబద్ధతతో పాటు అధ్యాపకులు మరియు ప్లేస్మెంట్ విభాగం ఇచ్చిన ఎప్పటికప్పుడు మార్గదర్శకతకు నిదర్శనం.కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జెబ్రోనిక్స్ వంటి సంస్థలో మా విద్యార్థులు ఉద్యోగాలు పొందడం శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారణం. వారి విజయం మా విద్య, శిక్షణ మరియు విలువలకు నిదర్శనం అని పేర్కొన్నారు.కె. కిశోర్ నాయుడు, టిపిఒ మాట్లాడుతూ “ఈ విజయం మా విద్యార్థులు, అధ్యాపకులు మరియు ప్లేస్మెంట్ విభాగం సమిష్టి కృషి ఫలితం. జెబ్రోనిక్స్ లో ఉద్యోగాలు పొందిన 9 మంది విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి మేము కృషిని కొనసాగిస్తాము అని తెలిపారు.