logo

*దివ్యాంగుల ఈత పోటిల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ *



పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉత్తరాంద్ర స్థాయి ఈత పోటిల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ చాటారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు. విశాఖపట్నం జివిఎంసీ ఆక్వా ఈత కొలనులో అట్టహాసంగా నిర్వహించిన ఈత పోటిల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ మౌనిక సబ్ జూనియర్ విభాగంలో 50 మీటర్ ఫ్రీ స్టైల్ పోటిల్లోనూ, ప్రియాంకదాస్ జూనియర్ విభాగంలో 50 మీటర్ ఫ్రీ స్టైల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, వీరిరువురికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన వారిని హైద్రాబాద్ లో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈనెల 12 న ఏలూరులో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో నూ ప్రతిభ కనుభరచాలని ఆకాంక్షించారు.

0
0 views