ఘనంగాఅచ్చంపేటలో దుర్గమ్మ నిమజ్జనం వేడుకలు
భక్తి శ్రద్ధలతో నవరాత్రుల పూజలు
మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు పాల్గొనడం విశేషం
ఘనంగాఅచ్చంపేటలో దుర్గమ్మ నిమజ్జనం వేడుకలు
భక్తి శ్రద్ధలతో నవరాత్రుల పూజలు
మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు పాల్గొనడం విశేషం
అచ్చంపేట, అక్టోబర్ 04:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో దుర్గమాత నవరాత్రి ఉత్సవాల ముగింపుగా శనివారం నిర్వహించిన నిమజ్జన కార్యక్రమం అందరినీ ఆకట్టుకునే అలంకరణలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ యువ నాయకులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా. గువ్వల బాలరాజు పాల్గొని భక్తులతో కలిసి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు.
కమిటీ తరఫున సన్మానం: ఈ
కార్యక్రమం ముగిసిన అనంతరం, నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు డా. గువ్వల బాలరాజును ఘనంగా సన్మానించారు. నవరాత్రుల సందర్భంగా ఆయన అందించిన సహకారం, మార్గనిర్దేశనకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలతో మమేకమవుతూ, హిందూ సంస్కృతి-సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా తన పాత్రను నిర్వర్తించనున్నట్లు డా. గువ్వల బాలరాజు తెలిపారు.కార్యక్రమం లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.