భక్తిశ్రద్ధలతో శ్రీ భవాని మాత అమ్మవారికి ఘనంగా పంచామృత అభిషేకం ప్రతి పనిలో దైవానుగ్రహం తోడవ్వాలి ** సివిల్ డివై ఎస్ ఇ దారపు రెడ్డి ప్రవీణ్ ***
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** మణుగూరు టౌన్** అక్టోబర్ 05***( ఎఐఎంఏ మీడియా ప్రతినిధి )భక్తిశ్రద్ధలతో శ్రీ భవాని మాత అమ్మవారికి ఘనంగా పంచామృత అభిషేకం ప్రతి పనిలో దైవానుగ్రహం తోడవ్వాలి సివిల్ డివై ఎస్ ఇ దారపు రెడ్డి ప్రవీణ్ కొండాపురం సి ఎస్ పి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద సివిల్ అధికారుల సహకారంతో సింగరేణి రైల్వే సైడింగ్ కాంటాక్ట్ కార్మికులు నిర్మించుకున్న శ్రీ భవాని మాత (కట్ట మైసమ్మ) ఆలయంలో అమ్మవారికి దసరా ఉత్సవాల ముగింపు పదకొండు రోజుల నవరాత్రుల అనంతరం ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో ఘనంగా పంచామృత అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి సివిల్ పర్యవేక్షకులు జే నవీన్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సివిల్ డి వై ఎస్ ఈ దారపు రెడ్డి ప్రవీణ్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ పై పనిచేస్తున్న కాంటాక్ట్ వర్కర్ల మరియు సింగరేణి ఉద్యోగుల పాలిట వారి కుటుంబ సభ్యులపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని అదేవిధంగా అందరికీ అన్నం పెట్టే సింగరేణి సంస్థ కూడా పదికాలాలపాటు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మనం చేసే ప్రతి పనిలో దైవానుగ్రహం కూడా తోడవ్వాలని ప్రవీణ్ అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పాటు ఎంతో క్రమ శిక్షణతో భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన రైల్వే సైడింగ్ కాంట్రాక్ట్ వర్కర్లను నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సివిల్ పర్యవేక్షకులు జె నవీన్ కుమార్ మరియు సింగరేణి సివిల్ రైల్వే సైడింగ్ మేట్ అంగోత్ మంగీలాల్, కుంటా రవికుమార్ , కాంట్రాక్ట్ కార్మికులు కుంటా కురుమూర్తి, గోవిందుల నాగేశ్వరరావు, జి శ్రీను, ఎం సాంబశివరావు వి శంకర్ తదితరులు పాల్గొన్నారు.