logo

కొత్తూరు సుబ్బరాయుని దర్శించుకున్న ఎన్ఆర్ఇజిఎస్ పిడి సూర్యనారాయణ.

నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA ): ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ఆర్ఇజిఎస్ డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం.రామకృష్ణ, ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ, నారాయణ స్వామి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపం నందు డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ కి స్వామివారి కంకణ ధారణ, పూలమాలలు, శాలువలు, శేష వస్త్రములతో ఘనంగా సత్కరించి, ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, టిడిపి నాయకులు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0
0 views