logo

దైవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రత్నకుమార్







దేవుని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రత్నకుమార్





సుజాతనగర్ అక్టోబర్ 5 (ఏఐ ఎంఏ మీడియా ప్రతినిధి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గొల్లగూడెం గ్రామం లోమనవార్త జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జక్కుల ఫాల్గుణ ఇంట్లో దేవుని కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్, మన ప్రగతి స్టాఫ్ రిపోర్టర్ కత్తి బాలకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులు కుటుంబ స్థాయిలో దేవుని కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఫాల్గుణ వార్తల ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అలాంటి జర్నలిస్టులు ఇలాంటివి చేయడం మనందరికీ గర్వకారణం అని అన్నారు.
ప్రెస్ క్లబ్ అనేది కేవలం వృత్తి వేదిక మాత్రమే కాదు, మనందరికీ ఒక కుటుంబం. ప్రతి సభ్యుడి ఆనందంలో, బాధలో మనమంతా భాగస్వాములమే” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, స్నేహితులు, బంధువులు పాల్గొని దేవుని ఆశీస్సులు అందుకున్నారు.

5
914 views