
మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
పవర్ తెలుగు దినపత్రిక 05-10-2025
బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలం
మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలను వేమనపల్లి మండలంలోని నీల్వాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ గారు ఘనంగా నిర్వహించారు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ గార్ల ఆదేశాల మేరకు ఈ వేడుకను నిర్వహించారు జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ గారితో కలిసి వేడుకలను నిర్వహించారు నివాళులు: ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్ గారు కాకా వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రసంగం: అనంతరం సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి గారి సేవలను కొనియాడారు. కాకా గారు పేదల పక్షపాతి అని, కార్మిక పక్షపాతి అని, కార్మికులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు అన్నదానం: కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నీల్వాయిలో మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ గారు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముల్కల్ల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీలు ఒడిలా రాజన్న, ఆత్రం గణపతి, మాజీ ఎంపీటీసీ అదే శంకర్, మాజీ కో ఆప్టెడ్ సభ్యులు జహీద్ అలీ, మాజీ సర్పంచులు గాలి మధు, తోకల రాంచందర్, కుబిడే కిష్టయ్య తదితర మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.