సుబ్రహ్మణ్యేశ్వరునికి వెండి పుష్ప మాల వితరణ: ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వెండి పుష్పమాల భక్తులు ఆదివారం వితరణ చేసినట్లు ఆలయ ఈవో యం. రామక్రిష్ణ తెలిపారు.గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళకు చెందిన కీర్తిశేషులు చిమట పోతురాజు జ్ఞాపకార్థం కుమారుడు రామక్రిష్ణ, కోడలు లక్ష్మీ లు వారికి స్వామి వారు ఇంటి ఇలవేల్పు కావడంతో 260 గ్రాముల వెండి పుష్పమాలను ఆలయ అధికార సిబ్బందికి ఇచ్చినట్లు ఈవో తెలిపారు. దాతలైన భక్తులకు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కంకణ ధారణ, పూలమాలలు, ప్రసాదం వితరణ చేశారు.