అరకు: ఉపాధి వేతనదారులకు ముఖ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి
ఉపాధిహామీ వేతనదారులు విధిగా ముఖ ఆధారిత ఈకేవైసీ చేయించుకోవాలని ఆదివారం అరకులోయ మండల ఏపీఓ జగదీశ్వరరావు తెలిపారు. ఈకేవైసీ చేయించుకున్న వేతనదారులకు మాత్రమే పని కల్పించబడుతుందన్నారు. ఈకేవైసీ కొరకు రేపు సాయంత్రం లోపు వీఆర్పీని కాని మేట్ ని కాని సంప్రదించాలన్నారు. బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ముఖ ఆధారిత ఈకేవైసీ తెచ్చినట్లు ఏపీఓ తెలియజేశారు.