logo

మరోసారి కోర్టుకెక్కిన కొత్తపేట ఎన్నికల పంచాయతీ ..

బాపట్ల జిల్లా :

వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ ఎన్నికలు వివాదంగా మారాయి. ఈ నెల 23 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే తన నామినేషన్ పత్రాలను స్వీకరించడం లేదంటూ మాజీ సర్పంచ్ చుండూరు వాసు పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

కొత్తపేట లో 13 ఎళ్ళుగా ఎన్నికలు నిలిపోవడంతో ఎన్నికల సంఘం ఈ నెల 21 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో ఈనెల 23 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇదే క్రమంలో కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఫీసుకు వెళ్ళారు. కోర్టు స్టే ఉందని ఎన్నికలు ప్రస్తుతం నిలిపి వేస్తున్నట్లు అధికారులు చెప్పడంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీనితో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే కొత్తపేట ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటీషన్ వేయడంతో మరలా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎన్నికలు నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని అందువలన నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

18
1710 views