logo

తీవ్ర విషాదం.... రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి....

జర్నలిస్ట్ : హసీబ్ (రియాజ్ బాబు)

అక్టోబర్ 26: తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ ఆహార ప‌దార్థాల్లో ఎలుక‌ల మందుని కలిపి పెట్టారు. పొలం వద్దకు వచ్చిన నెమళ్ళు ఆ ఆహారం తిని మృత్యువాత పడ్డాయి. సుమారు 50 నెమళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిని పరిశీలించి సదరు రైతుని అరెస్టు చేశారు. తెన్‌కాశీ జిల్లాలోని మీనాక్షిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు......

39
2032 views