
Surya Kumar Yadav:
2 సిక్సర్లతో భారీ రికార్డు: రోహిత్ సరసన సూర్య......
ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ముగిసింది. 2-1 తేడాతో ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది. బుధవారం నుంచి టీ 20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాన్ బెర్రా వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. అయితే వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగలేదు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన ఈ తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav)ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు...
సూర్యకుమార్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో 150 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ఇండియా ప్లేయర్లలో రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత స్థానం సూర్యదే కావడం విశేషం. కాన్ బెర్రా మ్యాచ్(Kanberra)లో సూర్య కుమార్ యాదవ్ తన రెండో సిక్స్‌ను కొట్టగానే 150 సిక్సర్ల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. 86 ఇన్నింగ్స్ లో 1,649 బంతులు ఎదుర్కొన్న సూర్య ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న ఐదో బ్యాటర్‌గా సూర్య(Suryakumar Yadav) నిలిచడు....
Surya Kumar Yadav: 2 సిక్సర్లతో భారీ రికార్డు: రోహిత్ సరసన సూర్య!
Suryakumar Yadav
అత్యంత వేగవంతమైన బ్యాటర్లలో సూర్య(Suryakumar Yadav) ఒకడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లలో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ రోహిత్ శర్మ పేరు మీదే ఉంది. రోహిత్ శర్మ 205 సిక్సర్లు కొట్టాడు. తాజాగా ఈ క్లబ్(T20 Cricket Record) లో రోహిత్ సరసన సూర్య చేరాడు. ఈ మ్యాచ్ లో సూర్య ఇంకో రికార్డు సాధించాడు నాలుగు వేర్వేరు దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారతదేశం) టీ20 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు కూడా సూర్యకుమార్ యాదవే కావడం గమనార్హం.
టీ20 క్రికెట్‌లో 150 సిక్సర్ల క్లబ్ చేరిన ప్లేయర్లు వీరే:
రోహిత్ శర్మ(భారత్) -205 సిక్సులు
మహ్మద్ వసీం(యూఏఈ)-183 సిక్సులు
మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)-173 సిక్సులు
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) -172
సూర్యకుమార్ యాదవ్(భారత్)- 150+