కార్మికులకు అండగా. ఆళ్లగడ్డ భవన నిర్మాణ కార్మికుల సంఘం
AIMA న్యూస్ . ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్ల గ్రామానికి చెందిన కార్మికుడు బాల సుబ్బరాయుడు బండలు కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ కాలిపై పడి నరాలు కట్టవడం జరిగింది విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు బిల్డర్ హుస్సేన్ వలి, ఉపాధ్యక్షులు వై కంబగిరి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఆ కుటుంబానికి 15000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన భూషణ్ భాష ప్రమాదంలో మరణించడం వారి కుటుంబ సభ్యులకు 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి కష్టమొచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారం అందిస్తామని అన్నారు కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు