logo

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా నిలిచినమహిళా క్రికెటర్లు

ఆకర్ష టీవీ అనకాపల్లి: స్థానిక వుడ్ పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో తలపడి, తొలిసారి భారత మహిళా క్రికెటర్లు విశ్వ విజేతగా నిలిచిన సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులు , కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. క్రికెట్ కేవలం పురుషులదే కాదని, ఆట అందరిదీ అని, మహిళలు కూడా క్రికెట్లో చరిత్ర సృష్టించారని ప్రిన్సిపాల్ సునీత తెలియజేశారు. కార్యక్రమంలో సిబ్బంది, విశ్రాంత నీటిపారుదల శాఖ ఏఈ మల్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

5
228 views