logo

ఎర్రచందనం స్మగ్లర్లు కు వార్నింగ్ ఇచ్చిన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

AIMA న్యూస్.అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ . ఉమ్మడి చిత్తూరు జిల్లా. మామండూరు అటవీ ప్రాంతాన్ని శనివారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా అడవిలో దాదాపు నాలుగు కిలోమీటర్లకు పైగా ఆయన ప్రయాణం చేశారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించడం జరిగింది. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలం కొండల్లో అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుండి అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుండి ఉద్భవిస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని, అక్కడ ఉన్నటువంటి పరిసరాలను ఉప ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ కు పవన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం 8 గోడౌన్లలో ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎ,బి, సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు తీసుకున్నారు. కొందరు ఎర్రచందనం స్మగ్లర్లు గా రెచ్చిపోతున్నారు వారందరికీ ఒకటే చెపుతున్న తాటతీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం పట్టుబడిన దగ్గర నుండి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదని అటవీశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

164
4245 views