
బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక మాస వనభోజన కార్యక్రమం
AIMA న్యూస్. నంద్యాల జిల్లా .ఆళ్లగడ్డ పట్టణ శివారు ప్రాంతంలో వెలసిన కాశింతల క్షేత్రంలో ఆదివారం రోజున ఆళ్లగడ్డ తాలూకా బలిజ సంఘీయుల కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోలాట నృత్యాలు పసందైన విందు భోజనం చేస్తూ పిల్లాపాపలతో ఆనందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు చరిత్రను రచించారని . హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని బలిజ కులస్తులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలలో బలిజలకు నామినేట్ పోస్టులు ఇవ్వాలని కోరారు. అందరూ కలిసి ఐక్యమత్తంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవచ్చని. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఇతర వర్గాలతో పాటు అత్యధిక శాతం బలిజలు కూటమి ప్రభుత్వానికి గత ఎలక్షన్లో అండగా నిలబడ్డారని అలాంటి వర్గానికి ప్రభుత్వంలో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ధూపం అభిమన్యుడు, ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య,ఆళ్లగడ్డ బలిజ సంఘం అధ్యక్షులు నల్లగట్ల బాలుడు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం వి ప్రసాద్, అర్జీగారి నరసింహుడు( రిటైర్డ్ ఆర్మీ), రామిశెట్టి వీరభద్రుడు, అడ్వకేట్ సుబ్బరామిరెడ్డి ,ఆవుల రాంపుల్లయ్య, ఆకుల చిన్న వెంకటసుబ్బయ్య, ప్రవీణ్ కుమార్, కొల్లం పుల్లయ్య, గుత్తి నరసింహుడు, ముడిమెల నాగరాజు, బొప్పాయి శ్రీనివాసులు, రాందాసు, సిద్ది నారాయణ, నీలి, రామారావు,సుబ్బరాయుడు,పడకండ్ల మద్దిలేటి, మైలారు శ్రీనివాసులు, అర్జీగారి శీను, గూబగుండం ఆంజనేయులు, నల్లగట్ల పవన్, ఆకుల నడిపి వెంకటసుబ్బయ్య, పాంపల్లె శ్రీకాంత్, జింకా రామస్వామి, నల్లవాగుపల్లె శ్రీకాంత్, దేవా ఆంజనేయులు, బావికాడి గుర్రప్ప , చైతన్య, కొండలరావు , మంగమ్మగారి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.